రాజు మ‌ర‌ణించి.. ఆరునెల‌లు అయినా వీడ‌ని మిస్ట‌రీ..!

by Nallavelli.Anjaneyulu |

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలోని 16వ డివిజ‌న్ మొగిలిచెర్ల‌లో ఆరు నెల‌ల క్రితం ల్యాద‌ల్ల రాజు అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే రాజు హార్ట్ స్టోక్ తో మ‌ర‌ణించాడ‌ని పోస్టుమార్టం నివేదిక వెల్ల‌డించారు.

రాజు మ‌ర‌ణించి.. ఆరునెల‌లు అయినా వీడ‌ని మిస్ట‌రీ..!
X

దిశ, గీసుకొండ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలోని 16వ డివిజ‌న్ మొగిలిచెర్ల‌లో ఆరు నెల‌ల క్రితం ల్యాద‌ల్ల రాజు అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే రాజు హార్ట్ స్టోక్ తో మ‌ర‌ణించాడ‌ని పోస్టుమార్టం నివేదిక వెల్ల‌డించారు. మ‌రోవైపు ల్యాద‌ల్ల రాజు గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని.. బాధిత కుటుంబ స‌భ్యులు పేర్కొంటున్నారు. రాజు శ‌రీరం పై అనుమానస్ప‌ద గాయాలు ఉన్నాయ‌ని..అత‌ని మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాలని తెలిపారు. ప‌థ‌కం ప్ర‌కారం.. చంపార‌ని నిందితుల‌ను ప‌ట్టుకోవాల‌ని శిక్షించ‌డంలో ఆల‌స్యం ఎందుకు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీసీ కెమెరాల, కాల్ డేటా ప‌రిశీలించి బాధితుల‌ను ప‌ట్టుకొని త‌క్ష‌ణ‌మే న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. పోరెన్సిక్ నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని మృతిని కుటుంబ సభ్యులతో మాట్లాడి బుధవారం డీసీపీ తో మాట్లాడుదాం అని కుటుంబ సభ్యులను హామీ ఇచ్చి డీసీపీ ఆఫీసు కి రావాలని కోరారు. దీనికి అంగీకరించిన మృతిని కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు.

Next Story