- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు : మంత్రి సీతక్క
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల ప్రజల వరకు తెలియజేయాలని, పార్టీ బలోపితానికి కృషి చేసే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గుర్తింపు వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల ప్రజల వరకు తెలియజేయాలని, పార్టీ బలోపితానికి కృషి చేసే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గుర్తింపు వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ గార్డెన్ లో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పార్టీలోని ప్రతి నాయకుడు తమ పరిధిలో నిబద్ధతతో, కష్టపడి పని చేయాలని, ప్రతి గ్రామంలో బూత్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రతి గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని, పార్టీ అభివృద్ధి కోసం పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఒకే తాటిపై నడిచి ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆమె ఉద్బోధించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






