గ్రామాల గల్లీల్లో గంజాయి.. మత్తులో యువత చిత్తు

by Ratna Kumari |

గ్రామాలలో గంజాయి వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతుంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి గొడవలు, కొట్లాటలకు దిగుతున్నారు. గంజాయి రవాణా పల్లెలకు కూడా పాకడంతో యువత మత్తుకు ఆకర్షితులవుతున్నారు.

గ్రామాల గల్లీల్లో గంజాయి.. మత్తులో యువత చిత్తు
X

దిశ, ధర్మసాగర్ : గ్రామాలలో గంజాయి వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతుంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి గొడవలు, కొట్లాటలకు దిగుతున్నారు. గంజాయి రవాణా పల్లెలకు కూడా పాకడంతో యువత మత్తుకు ఆకర్షితులవుతున్నారు. గంజాయి రవాణా చేసే వారి నుంచి కొనుగోలు చేస్తున్నారు. గ్రామ శివారులో, నిర్మానుష్య ప్రాంతాల్లో సిగరెట్ లోకి ఎక్కించి యువత గంజాయి పీల్చుతున్నారు. గంజాయి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే దొరికే ఈ మత్తుపదార్థం ఇప్పుడు గ్రామాల్లోని యువతను మత్తుకు బానిస చేసి విధంగా విరివిగా లభిస్తుంది. దీంతో ఎంతో మంది యువత ఆ మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడి కొందరు సిగరెట్లు చాక్లెట్లు ఎక్కడెక్కడ గంజాయిస్తుంటే మరికొందరు సిగరెట్ రూపంలో దీన్ని విక్రయిస్తున్నారు. గంజాయి యువత చెంతకు చేరి వారిని పెడదారి పట్టిస్తుంది. కొందరు విద్యార్థులు, యువకులు, గంజాయి, డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నారు. లక్ష్యంవైపు సాగుతూ చదువుపై దృష్టి సారించాల్సిన యువత తప్పటడుగులు వేస్తూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోంది. గంజాయిని సేవించడం సరదాగా అటవాటు చేసుకొని యువత మత్తులో కూరుకుపోతున్నది.

ప్రతి గ్రామంలో తాగుడు బానిసైన యువకులు

ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఒక్కరి నుంచి పది మంది యువకులకు దాకా గంజాయికి అలవాటు పడ్డారు. గ్రామాలు గ్రామాల్లోని యువతను గంజాయి మత్తు వదలడం లేదు దానికి తోడు అమ్మే వారు కూడా ఎక్కువయ్యారు. ప్రతి గ్రామంలో ఒక్కరి నుంచి పదిమంది వరకు కచ్చితంగా గంజాయి చేయిస్తున్నారు. గంజాయి మత్తులో ఉన్న యువత దేనికి వెనకడటం లేదు. వారు గంజాయి సేవిస్తున్నప్పుడు ఎవరైనా వెళ్లి ఇదేంటి అని అడిగితే వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడడం లేదు. గంజాయి మత్తుకు క్రమక్రమంగా అలవాటుపడిన విద్యార్థులు, యువకులు గంజాయి మాఫియా వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఒక్కసారి గంజాయి మత్తుకు అలవాటుపడి అందులో నుంచి బయటపడలేక విలవిలాడుతున్నారు. గంజాయికి డబ్బుల్లేక దొంగతనాలు, ఇతర నేరాలకూ వెనుకాడటం లేదు. ఇంకొందరు పెద్దఎత్తున కమీషన్‌ రావడం, యువతకు గంజాయి లభించడంతో మారుతున్నారు.

నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలు గంజాయి తాగుడుకు అడ్డాలు

ఒత్తిడి నుంచి బయటపడేందుకు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఇటీవల కాలంలో గంజాయి వినియోగం ఎక్కువైందనే చెప్పవచ్చు. యువత, విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసగా మారుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌ పోలీసు అధికారుల సోదాల్లో బయటపడింది. మద్యం మత్తులో ఇప్పటికే మునిగి తేలుతున్న యువత క్రమేపీ గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తూ కొత్త మత్తుకు అలవాటు పడుతున్నట్లు తెలియవస్తున్నది. గంజాయి విరివిగా దొరుకుతుండటంతో యువతలో వినియోగం కూడా పెరిగిపోయింది.నిర్మానుష్య ప్రదేశాలే అడ్డాలు.. శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని గంజాయిని సింగరెట్లలో నింపుకొని వినియోగిస్తున్నారు. 50గ్రాముల గంజాయిని రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి ఆకును సిగరెట్లలో నింపుకుని తాగుతూ మత్తులో తేలుతున్నారు. శివారుప్రాంతాల్లో యువత గంజాయి మత్తులో తూగుతున్నారు.

అధికారులు గ్రామాల యువకులపై ఓ కన్నెయండి

అధికారులు గ్రామాల్లో ఉన్న యువకులపై ఒక కన్నేయ్యలని యువత గంజాయి మత్తుకు బానిసలే ఇష్ట రీతిలో గంజాయి కి అలవాటు పడి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్నారని దీన్ని ఆపడానికి అధికారులు యువతపై ఒకన్నేసి వారికి అమ్మేవారిని పట్టుకోవాలని కోరారు.పలు పాన్‌ షాపుల్లోనూ గంజాయి, ఇతర మత్తుమందు సిగరెట్లు అమ్ముతున్నట్లు సమాచారం. ఇటీవల ఎక్సైజ్‌ అధికారుల దాడిలోనూ చాక్లెట్లు పెద్ద మొత్తంగా వాడుతున్నారని, ఇప్పటికైనా టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌, పోలీసు అధికారులు గంజాయికి బానిసలుగా మారిన యువతపై దృష్టి పెడితే.. అసలు రవాణా ఎక్కడి నుంచి సాగుతోందనే విషయం తేటతెల్లమవుతుంది.యువత ను ఆలంటి దుశ్చర్యలకి పాలడకుండా అడ్డుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Next Story