- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేద మహిళలకు ఆదర్శ సేవా సమితి ఆర్థిక సహాయం
by Ratna Kumari |
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదర్శ సేవా సమితి నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నపాక పూలమ్మ కు ఆర్థిక సహాయం చేశారు.

X
దిశ, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదర్శ సేవా సమితి నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నపాక పూలమ్మ కు ఆర్థిక సహాయం చేశారు. భర్తను కోల్పోయి ఇద్దరు కుమార్తెలతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సొంత ఇల్లు లేకుండా తాత్కాలికంగా తాటి ఆకుల ఇల్లు వేసుకుని జీవిస్తూ జీవనం సాగిస్తోందని తెలుసుకున్న ఆదర్శ సేవా సమితి బాధ్యులు ఐదు వేల రూపాయలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సేవా సమితి సభ్యులను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి అందరి మన్నునలు పొందాలని ఆశించారు. కార్యక్రమంలో ముదురుకోళ్ల అశోక్, రంజిత్, వార్డు మెంబర్ రాజు, భాస్కర్ల చందన్ పాల్గొన్నారు.
Next Story






