- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి..
నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

దిశ, ఆత్మకూరు: అభివృద్ధి పనులు చేయకుండా పంచాయతీ తీర్మానాలు లేకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం చేసి, తప్పుడు బిల్లులు సృష్టించి నిధులను దోచుకున్న పెద్దాపూర్ సర్పంచ్ ఎలుకటి రవి, ఉపసర్పంచ్ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్‌లపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ వ్యక్తిగత ఖాతాకు నిధులు మళ్లించుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు చేయకుండా అధికారులు బిల్లులు ఎలా మంజూరు చేస్తారని మండిపడ్డారు. వార్డు మెంబర్లు ఏలకాటి బాలరాజు, గోనె దామోదర్, గోనె రమ, లింగంపల్లి సమత, కోరుకొప్పుల నాగలక్ష్మి, గ్రామస్థులు వేల్పుల సురేష్, లకిడే శివరాం, లింగంపల్లి అనిల్, మోతే రమేష్, గోనె మధుకర్, తదితరులు పాల్గొన్నారు.






