భూమికోసం సవతి తల్లి పై హత్యాయత్నం నిందితుడి అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

భూమి కోసం స‌వతి త‌ల్లి పై హ‌త్యాయ‌త్నం చేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. సీఐ సంతోష్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..

భూమికోసం సవతి తల్లి పై హత్యాయత్నం నిందితుడి అరెస్ట్
X

దిశ, ఆత్మకూరు : భూమి కోసం స‌వతి త‌ల్లి పై హ‌త్యాయ‌త్నం చేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. సీఐ సంతోష్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్- ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మకూర్ గ్రామానికి చెందిన సంగె రాజీవ్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుడు చిన్న వయసులోనే తన తల్లి మరణించగా, అతని తండ్రి సంగె ఈశ్వర అలియాస్ శారద (55)ను వివాహం చేసుకున్నాడని తెలిపారు. తన సవతి తల్లి పేరుపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎకరం 10 గుంటల భూమి మంజూరైనట్లు, గత సంవత్సరం నిందితుని కూతురు వివాహ సమయంలో పసుపు కుంకుమల క్రింద 15 గుంటల భూమి ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆ భూమి తనకు రావాలనే ఉద్దేశంతో నిందితుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్ల‌డైంది.

ఈ క్రమంలో నిందితుడు గత రెండు మూడు రోజులుగా అవకాశం కోసం ఎదురుచూసి, శుక్రవారం ఉదయం సుమారు 11.30 గంటల కు ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో తన సవతి తల్లి సంగె ఈశ్వర ఇంటి వద్ద ఘటనకు ప్రయత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం సంఘటన జరిగిన స్థలంలోనే ఉపయోగించిన వస్తువును దాచి పరారయ్యాడన్నారు. ఈ విషయం తెలిసిన నిందితుడు శనివారం ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వయంగా లొంగిపోయి, పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడన్నారు. తన ఇంటి వద్ద బాత్రూమ్ పక్కన దాచిన తెలుపు రంగు, మూడు అడుగుల పొడవు ఒక అంగుళం వెడల్పు గల నవారు పట్టేను పోలీసులకు చూపించగా.. దానిని సీజ్ చేసి, అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Next Story