అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు

by Ratna Kumari |

వరంగల్ జిల్లాలో పని చేస్తున్న అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్ లు అందజేస్తామని వరంగల్ కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ సత్యశారద తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు
X

దిశ, హన్మకొండ టౌన్ : వరంగల్ జిల్లాలో పని చేస్తున్న అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్ లు అందజేస్తామని వరంగల్ కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ కోసం చేసుకున్న వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ప్రయత్నించాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2026-2028 సంవత్సరానికి నూతన కార్డులు జారీచేసే కార్యక్రమాన్నీ ప్రారంభిస్తామన్నారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు మంజూరు చేయడానికి ప్రతిపాదించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని ఆమె పేర్కొన్నారు. ఎవరు కూడా ఆందోళనకు గురి కాకుండా జర్నలిస్టులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని జర్నలిస్టులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ ప్రేమలత, వరంగల్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శ్రీరాంచంద‌ర్, మెండు రవీందర్, దొంతు నవీన్, బొడిగ‌ శ్రీనివాస్, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల సోమేశ్వర్, హుస్సేన్ పాషా బొల్లపల్లి రాజు పాల్గొన్నారు.

Next Story