చెరువులో మునిగిన ట్రాక్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం

by Disha Web Desk 13 |
చెరువులో మునిగిన ట్రాక్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, భీమదేవరపల్లి: ట్రాక్టర్‌ను కడుగుదామని చెరువులోకి తీసుకువెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో ట్రాక్టర్.. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ ఘటన స్థానికంగా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడిపే బాబు ట్రాక్టర్ ను కడుగుదామని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. చెరువు ఒడ్డున పెట్టుకుని ట్రాక్టర్ కడుగుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ చెరువులోకి వెళ్లి మునిగిపోయింది.

వెంటనే ట్రాక్టర్ పై నుండి డ్రైవర్ బాబు నీటిలోకి దూకాడు. కానీ డ్రైవర్ కు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, అటుగా వ్యవసాయ బావి వద్దకు వెళుతున్న సర్పంచ్ శాంతి కుమార్, చేపలకు కాపలా ఉండే జాలరి పెంచుకల అంజి చూసి వెంటనే తమ ప్రాణాలకు తెగించి పక్కనే ఉన్న పైపు సాయంతో అతడిని కాపాడారు. అనంతరం క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ను బయటకు తీశారు. చెరువులో ఉపాధి హామీ పనుల్లో భాగంగా తీసిన గుంతల వలన ఇలాంటి ఘటన జరిగిందని గ్రామస్తులు తెలిపారు.

వీడియో: https://www.youtube.com/shorts/NZcGei9D-7w



Next Story

Most Viewed