- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతులను తరిమే క్రమంలో ప్రమాదం.. వ్యక్తి మృతి
మండలంలోని పత్తిపాక గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కోతులను తరిమే క్రమంలో పై అంతస్తు నుంచి జారి పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కోతులను తరిమే క్రమంలో పై అంతస్తు నుంచి జారి పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై జే. పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తడక కరుణాకర్ (51) ఎల్‌ఐసీ ఏజెంట్ గా ఈ నెల 24న ఉదయం సుమారు 7 గంటల సమయంలో తన ఇంటి పై అంతస్తులోకి కోతులు వచ్చినట్లు పొరుగువారు గొల్లపల్లి భాస్కర్ తెలిపారు. వెంటనే పై అంతస్తుకు వెళ్లి వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కోతులు ఒక్కసారిగా అతని మీదికి రావడంతో భయంతో తప్పించుకునే ప్రయత్నంలో కాలుజారి పై అంతస్తు నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో కరుణాకర్‌కు తలకు, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ముక్కు, చెవుల నుంచి రక్తస్రావం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈ నెల 27న ఉదయం కరుణాకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతని మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు.






