- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీఎంను ఢీ కొట్టి యువకుడు మృతి
డీసీఎంను ఢీ కొట్టి యువకుడు మృతి చెందిన సంఘటన నర్సంపేట మండల పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, నర్సంపేట : డీసీఎంను ఢీ కొట్టి యువకుడు మృతి చెందిన సంఘటన నర్సంపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన చలమల్ల ప్రశాంత్ రెడ్డి నర్సంపేట మండలంలోని ఓ గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడి నుంచి నల్లబెల్లి వైపుగా ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సరిగ్గా ఇటుకాలపల్లి బ్రిడ్జి దాటి వెళ్లగానే ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యువకుడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మాంస ముద్దలు రోడ్డంతా అక్కడక్కడ పడిపోయి ఉండటం స్థానికులను కలచివేసింది. నారక్కపేట నుంచి ఇటుకాలపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైవే సిబ్బంది వన్ వే లో వాహనాలు వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సాయంత్రం వేళ వెళ్ళే ప్రయాణీకులు సూచికలు లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.






