అంబులెన్స్ పై కూలిన చెట్టు

by Ratna Kumari |

నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది.

అంబులెన్స్ పై కూలిన చెట్టు
X

దిశ, నర్సంపేట : సాధార‌ణంగా అంబులెన్స్ లో పేషెంట్ల‌ను త‌ర‌లిస్తుంటారు. రోగికి అత్య‌వ‌స‌రంగా చికిత్స అందించేందుకు అంబులెన్స్ లు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో అంబులెన్స్ లు కూడా ప్ర‌మాదాలకు గుర‌వుతుంటూ ఉంటాయి. తాజాగా అంబులెన్స్ అనుకోని ప్ర‌మాదం చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది. ఈ ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లి శివారులో చోటు చేసుకుంది. అంబులెన్స్ పై చెట్టు విరిగిపడటంతో డ్రైవర్, రోగి బంధువులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే మరో వాహనంలో రోగిని వరంగల్ లోని ఆస్పత్రికి తరలించారు.

Next Story