- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > సైకిల్ ను ఢీకొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి, మరో బాలుడికి తీవ్ర గాయాలు..
సైకిల్ ను ఢీకొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి, మరో బాలుడికి తీవ్ర గాయాలు..
by Taduka Kalyani |
సైకిల్ ను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామంలో జరిగింది.

X
దిశ, గూడూరు: సైకిల్ ను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టేవాడ గ్రామానికి చెందిన వాసం వర్షిత్ కుమార్(12), తన స్నేహితుడు అయిన అరెం నవదీప్ తో కలిసి గ్రామంలో సైకిల్ పై ప్రయాణిస్తున్న క్రమంలో అదే గ్రామంలో మొరం తరలిస్తున్న ట్రాక్టర్ సైకిల్ ను ఢీకొట్టడంతో వర్షిత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవదీప్ కు తీవ్ర గాయాలు కావడంతో మహబుబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






