రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

రోడ్డు ప్రమాదంలో వ్య‌క్తికి తీవ్ర గాయలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తికి తీవ్ర గాయాలు
X

దిశ‌, కొత్త‌గూడ : రోడ్డు ప్రమాదంలో వ్య‌క్తికి తీవ్ర గాయలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన దుర్గారావు భూపాల్ తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం గంగారం వెళ్లి తిరిగి వస్తుండగా.. స్మశాన వాటిక సమీపానికి రాగానే బైకు అదుపుతప్పి కిందపడడంతో భూపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తినీ 108 అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story