ప్రేమ పేరుతో యువ‌తిని మోసం చేసిన వ్య‌క్తి అరెస్ట్

by Ratna Kumari |

ప్రేమ పేరుతో యువ‌తిని మోసం చేసిన వ్య‌క్తి అరెస్ట్ అయిన ఘ‌ట‌న బ‌చ్చ‌న్న‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో యువ‌తిని మోసం చేసిన వ్య‌క్తి అరెస్ట్
X

దిశ‌, బ‌చ్చ‌న్న‌పేట : ప్రేమ పేరుతో యువ‌తిని మోసం చేసిన వ్య‌క్తి అరెస్ట్ అయిన ఘ‌ట‌న బ‌చ్చ‌న్న‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ ఓ యువ‌తి వెంట ప‌డ్డాడు ఓ యువ‌కుడు. ఆ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు నిందితుడు ర‌సూల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ యువత ఎటువంటి తాత్కాలిక ఆకర్షణలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ పరిచయాల పట్ల, అపరిచితులతో వ్యక్తి గత వివరాలను పంచుకునే విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story