- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తపంతో వ్యక్తి ఆత్మహత్య
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోడాషపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

దిశ, ధర్మసాగర్/ వేలేరు : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోడాషపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వేలేరు ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలేరు మండలం సోడాషపల్లి కి చెందిన బండారి కుమారస్వామి (33) బీటెక్ వరకు చదువుకున్నాడు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్థాపం తో భాదపడుతుండేవాడు. ఈ క్రమంలో కుమారస్వామి భార్య స్వప్న వ్యవసాయం చేసుకుని బ్రతుకుదామని చెప్పింది. అయిన దిగులుతో ఉంటూ గురువారం తన వ్యవసాయ క్షేత్రం వద్ద చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. చుట్టుపక్కల రైతులు చూసి తన భార్య స్వప్న కు సమాచారం ఇవ్వగా వెళ్లి చూడగా అప్పటికే చెట్టు కు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. కాగా మృతుని భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.






