అధికారుల వేధింపులు.. బస్టాండ్‌లోనే సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యయత్నం (వీడియో)

by Disha Web Desk 19 |
అధికారుల వేధింపులు.. బస్టాండ్‌లోనే సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యయత్నం (వీడియో)
X

దిశ, ఎంజీఎం సెంటర్: ఆర్టీసీ అధికారుల వేధింపులు తాళలేక బస్టాండ్ క్యాంటీన్ ఓనర్ సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం.. గత కొద్దిసంవత్సరాలుగా ఎస్.కె శబాష్ అనే యువకుడు వరంగల్ బస్టాండ్‌లో క్యాంటీన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మూడు నెలల క్యాంటిన్ రెంట్ ఒకేసారి కట్టాలని ఆర్టీసీ అధికారులు తనని వేధిస్తున్నారని తెలిపాడు. కరోనా విజృభించిన సమయంలో కూడా రెంట్ కట్టానని.. అయినప్పటికీ కొంచమైనా మానవత్వం చూపించకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయాడు. ప్రతి నెల లక్ష 35 వేల రూపాయలు అద్దె కడుతున్నానని.. అయినప్పటికీ క్యాంటిన్‌లో వస్తువులు వాడుకుంటూ తనను లాస్ చేసి.. చివరకు క్యాంటీన్‌కి తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ శనివారం బస్టాండ్ ఏరియాలోనే పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి ఎంజీఎంకు తరలించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtube.com/shorts/sYhgvazxFPI




Next Story