- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమృత్ భారత్ తో మానుకోట రైల్వే స్టేషన్ కు మహార్దశ !
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో మానుకోట రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోయాయి. ఫ్లాట్ ఫామ్ లు మారుతూ

దిశ, మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో మానుకోట రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోయాయి. ఫ్లాట్ ఫామ్ లు మారుతూ ఎక్కే పరిస్థితికి చెక్ పడే అవకాశం త్వరలోనే రానుంది. అత్యాధునిక అంగులతో 26.49 కోట్లతో రిడేవలప్మెంట్ చేస్తున్నామని బిల్డింగ్, వెయిటింగ్‌హాల్ పనులు,కవర్ ఓవర్ ప్లాట్‌ఫాం పనులు పూర్తయ్యాయని మొత్తంగా సుమారు 92% మేర పనులు పూర్తి అయ్యాయి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గతంలో కంటే రైల్వేస్టేషన్లను మరింత అందంగా, పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా మార్చడమే అమృత్ భారత్ లక్ష్యం అని వెల్లడించారు. అలాగే తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల ను అప్‌గ్రేడేషన్ చేస్తున్నమని మానుకోట రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదిక గా పంచుకున్నారు. త్వరలోనే రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు.
అమృత్ భారత్ లో చేసే పనులు ఇవే.!
రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాల మెరుగుదల, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు, మరుగుదొడ్లు, రైల్వేస్టేషన్ పైకప్పులు వంటివి పునరుద్ధరిస్తారు. రైల్వే స్టేషన్లకు దగ్గర్లో ఉన్న నగరాలను కలుపుతూ స్టేషన్ బిల్డింగ్ అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ రైల్వేస్టేషన్లను బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. అవసరమైన చోట లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉచిత వై-ఫై సదుపాయం, మెరుగైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కింద స్థానిక ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించారు. ఫుడ్ కోర్టులు, ఆట స్థలాలు వంటివి ఏర్పాటు చేస్తారు. స్టేషన్ సమీపంలో రోడ్లను వెడల్పు చేయడం, అవసరం లేని నిర్మాణాలు ఉంటే తొలగించడం, ప్రత్యేక పాదచారుల మార్గాలు మెరుగైన పార్కింగ్, బెస్ట్ లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయా మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.






