- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్సూరెన్స్ డబ్బుల వివాదమే హత్యకు కారణం..!
దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

దిశ, దుగ్గొండి: దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం విచారణ చేపట్టగా, తన పెద్దనాన్న ముస్కుల సాంబరెడ్డి హత్యకు గల కారణాలను నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి పెద్ద నాన్న కు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను తన తమ్ముడు ఒక్కరే తీసుకుని, నిందితుడైన ముస్కుల రాజుకు వాటా ఇవ్వలేదనే ఆగ్రహంతో తరచూ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జరిగిన గొడవలో కట్టెతో దాడి చేసి, అనంతరం గొంతు పిసికి సాంబరెడ్డిని హత్య చేసినట్లు విచారణలో నిందితుడు గ్రామ పెద్దలు, పంచులు సమక్షంలో ఒప్పుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.






