- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గీసుగొండలో చైన్ స్నాచర్ కలకలం
మహిళా మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కొని బైకు పై పరారైన ఘటన గీసుకొండ మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, గీసుకొండ : మహిళా మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కొని బైకు పై పరారైన ఘటన గీసుకొండ మండలంలో చోటు చేసుకుంది. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన తన కూతురు, అల్లుడు, తాళ్లపల్లి కవిత, రాజయ్య ఈనెల 12న ఆదివారం గృహ ప్రవేశానికి వచ్చారు. గృహ ప్రవేశం పూర్తయిన తరువాత తిరిగి ఈనెల 15న కూతురు ఇంటి ముందు కూర్చొని ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మంచి నీరు కావాలని అడిగారు. వెంటనే తన మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కొని బైకు పై పారిపోయారని పాలడుగు రామనర్సమ్మ ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.
Next Story






