- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన యువకులను దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కేసు నమోదు చేయాలి
మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన భూక్యా నరేష్, భూక్యా సురేష్ లపై ఫారెస్ట్ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై హత్య నేరం కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయ విచారణ జరిపించాలని లంబాడి హక్కుల పోరా సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ డిమాండ్ చేసారు.

దిశ, మహాముత్తారం : మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన భూక్యా నరేష్, భూక్యా సురేష్ లపై ఫారెస్ట్ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై హత్య నేరం కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయ విచారణ జరిపించాలని లంబాడి హక్కుల పోరా సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ డిమాండ్ చేసారు. హన్మకొండలో ఒక ప్రవేటు హాస్పిటల్ చికిత్స పొందుతున్న నరేష్ సురేష్ లను పూల్ సింగ్ పరామర్శించారు. గత ఆదివారం భూక్య నరేష్ తన సొంత భూమిలో భూమి చదును చేయడానికి వెళ్ళగా నిమ్మగూడెం బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రెడ్డిపల్లి బీట్ ఆఫీసర్ అఖిల్ రెడ్డి విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారని, చంపడానికి ప్రైవేట్ పార్ట్స్ పై కాళ్ళతో తన్నారని, మెడ భాగంపై నొక్కారని, ఈ దాడిని ఆపడానికి వచ్చిన సురేష్ ని కర్రలతో, మెడ భాగం పై, ప్రైవేట్ పార్ట్స్ పై , కాళ్ల పై కొట్టారని వారి దాడికి సృహతప్పిపడిపొగ ప్రక్క చేను వాళ్లు విడిపించారని అన్నారు.
సంబంధిత ఫారెస్ట్ అధికారులపై హత్యా, నేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేవలేని స్థితిలో ఉన్న ఇరువురిని గ్రామస్తులు తీసుకురాగా, పోలీసులు గ్రామస్తులు అంబులెన్స్ మాట్లాడి 100 పడకల హాస్పిటల్ , భూపాలపల్లి కి పంపించారని ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని, కానీ నేటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం హస్య స్పదంగా ఉందని పూల్ సింగ్ విమర్శించారు. వెంటనే బాధితులకు న్యాయం చేయకుంటే జిల్లా ఎస్పీ, ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గిరిజన యువకులపై దాడి చేసిన అటవీశాఖ అధికారులపై కేసులు నమోదు చేయకుంటే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మహాముత్తారం పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.






