అక్రమంగా మొరం తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

ఎస్సార్ఎస్పీ కెనాల్ నుంచి అక్ర‌మంగా మొరం తరలిస్తున్న ముగ్గురి పై కేసు నమోదు చేసి రెండు టిప్పర్ లారీలను సీజ్ చేసినట్టుగా సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.

అక్రమంగా మొరం తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు
X

దిశ, గీసుకొండ : ఎస్సార్ఎస్పీ కెనాల్ నుంచి అక్ర‌మంగా మొరం తరలిస్తున్న ముగ్గురి పై కేసు నమోదు చేసి రెండు టిప్పర్ లారీలను సీజ్ చేసినట్టుగా సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ స్టేషన్ సిబ్బందితో ఎస్సార్ఎస్పీ కెనాల్ శాయంపేట సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. సంగెం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన రంగు భరత్, కుంటపల్లి గ్రామానికి చెందిన కడదూరి రాకేష్, సంగెం మండల కేంద్రానికి చెందిన మహాకాళి రవి అనే ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మోరాన్ని అనుమతి పత్రాలు లేకుండా తరలించడాన్ని గుర్తించారు. వెంటనే రెండు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story