- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లోకి దూసుకువచ్చిన కారు..
by Batti.Sumithra |
మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలోని NH365 రోడ్డు ప్రక్కన ఉన్న గడ్డం చెన్నయ్య ఇంటిలోకి కారు దూసుకవచ్చి బీభత్సం సృష్టించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

X
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలోని NH365 రోడ్డు ప్రక్కన ఉన్న గడ్డం చెన్నయ్య ఇంటిలోకి కారు దూసుకవచ్చి బీభత్సం సృష్టించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుడు చెన్నయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ నుండి కురవివైపు వెళుతున్న కారు అదుపుతప్పి రేకుల ఇంట్లోకి దూసుకవచ్చింది. తాను ఇదే ఇంట్లో సెలూన్ షాపు నడుపుతూ జీవనం గడుపుతున్నట్లు తెలిపారు. ఎండకు వేడి గాలి వస్తుందని ఆరు బయట కూర్చున్నామని, సమయానికి ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని వాపోయారు.
Next Story






