స్కూల్‌ వెళ్లడం ఇష్టం లేక 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

by velandi.Saikiran |

పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేక మనస్తాపం చెంది 9వ తరగతి విద్యార్

స్కూల్‌ వెళ్లడం ఇష్టం లేక 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, పర్వతగిరి: పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేక మనస్తాపం చెంది 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నారం షరీఫ్ లో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మృతుడు ఏర్నాగి సాత్విక్ (14) ఏకశిలా స్కూలు పున్నేలు గ్రామం, అయినవోలు మండలంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.

సెప్టెంబర్ 1న అనారోగ్యం కారణంగా పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడు సాత్విక్. ఇక‌ సెప్టెంబర్ 4న తిరిగి పాఠశాలకు వెళ్లడానికి సిద్ధం కావాలని చెప్పగా వినాయక నిమజ్జనం తర్వాత వెళ్తానని సాత్విక్ చెప్పాడు. ఈ క్రమంలో త‌ల్లిదండ్రులు.. కెనరా బ్యాంకుకు వెళ్లారు. అయితే.. త‌ల్లిదండ్రులు తిరిగి వ‌చ్చే స‌రికి సాత్విక్ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకపోవడమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Next Story