రూ. 60 వేల‌ సీఎంఆర్ఎఫ్‌ చెక్కు అంద‌జేత‌

by velandi.Saikiran |

మండల కేంద్రానికి చెందిన రావిశెట్టి కిషన్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులు భరించలేని

రూ. 60 వేల‌ సీఎంఆర్ఎఫ్‌  చెక్కు అంద‌జేత‌
X

దిశ, బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన రావిశెట్టి కిషన్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉండగా, ఈ విషయం రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా చేరింది. వెంటనే స్పందించిన ఆయన, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹60,000 మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆ చెక్కును బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జనగామ జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి జయా మల్లేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా రజక చైతన్య సంఘం అధ్యక్షుడు ఎద్దునూర్ రవీందర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఇస్మాయిల్, మాజీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు చిర్రా హనుమంత రెడ్డి, యువ నాయకులు బాల్నే నరేష్, లింగాల రాజేందర్ రెడ్డి, లింగాల వెంకట్ రెడ్డి, ఉదయ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story