విద్యా రంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలి

by Nallavelli.Anjaneyulu |

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.

విద్యా రంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యా రంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించి విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషాబోయిన సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జు జ్యోతి, జక్కుల భానుప్రసాద్, సిపతి వినయ్, జిల్లా సమితి సభ్యులు, సీ.హెచ్ వంశీ కుమార్, శ్రవణ్ పాల్గొన్నారు.

Next Story