- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేఎన్ఎస్ లో 2కే రన్, 5కే సైక్లింగ్ పోటీలు
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర క్రీడా అధికార సంస్థ (సాట్)ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో క్రీడాకారులకు 2కే రన్, 5కే సైక్లింగ్ పోటీలు నిర్వహించారు.

జేఎన్ఎస్ లో 2కే రన్, 5కే సైక్లింగ్ పోటీలు
ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని చాటాలి : డీవైఎస్ఓ అశోక్ కుమార్
దిశ, హన్మకొండ టౌన్ : బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర క్రీడా అధికార సంస్థ (సాట్)ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో క్రీడాకారులకు 2కే రన్, 5కే సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీవై ఎస్ఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో స్నేహపూరిత వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. 2 కే రన్ విజేతలుగా ఎల్.శివ, రవితేజ, ఆరోగ్య పాల్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. అలాగే 5కే సైక్లింగ్ పోటీల్లో చరణ్ తేజ్, భార్గవ్, హర్షిత్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.






