- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్ తిని.. 12 మందికి అస్వస్థత
ఉడికి ఉడకని చికెన్ తిని 12 మంది చత్తీస్ ఘడ్ వలస కూలీలు అస్వస్థతకు గురైన ఘటన వాజేడు మండలం పేరూర్ గ్రామ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ,ఏటూరునాగారం : ఉడికి ఉడకని చికెన్ తిని 12 మంది చత్తీస్ ఘడ్ వలస కూలీలు అస్వస్థతకు గురైన ఘటన వాజేడు మండలం పేరూర్ గ్రామ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వాజేడు మండలం పేరూరు గ్రామ పంచాయతీ చింతూరు గ్రామంలో నూకల రవి అనే వ్యవసాయ రైతు దగ్గర ఉన్న12 మంది చత్తీస్ ఘడ్ వలస కూలీలు సోమవారం రోజున ఉడికి ఉడకని చికెన్ తినడం వలన అస్వస్థత గురైయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పేరూరు వైద్య సిబ్బంది కూలీల వద్దకు ఒక టీంను పంపించి వైద్య పరీక్షలు చేశారు. అస్వస్థకు గురైన వారిలో 9 మందిని పీహెచ్‌సీ తరలించి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో వేణుగోపాల్ కృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ రమ, హెచ్ఏ శ్రీను, తదితర వైద్య సిబ్బంది పాల్గోన్నారు.
Next Story






