ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఒత్తిడికి లోను కావ‌ద్దు : ఎస్సై సురేష్

by Nallavelli.Anjaneyulu |

వేలేరు మండల కెద్రంలోని త్వరలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వేలేరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఒత్తిడికి లోను కావ‌ద్దు : ఎస్సై సురేష్
X

దిశ, ధర్మసాగర్ : వేలేరు మండల కెద్రంలోని త్వరలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వేలేరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు వేలేరు ఎస్‌.ఐ సురేష్ కుమార్ ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌.ఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చదువుతో పాటు మంచి విలువలను కూడా అలవర్చుకోవాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు మరియు ఇతర దృష్టి మళ్లించే అంశాల నుండి దూరంగా ఉండి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. విద్యార్థుల్లో ప‌రీక్ష‌ల ఆత్మ‌విశ్వాసం పెంపొందించ‌డమే ల‌క్ష్య‌మ‌ని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story