మల్లక్కపేట బాలికల హాస్టల్‌లో విషాదం.. పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

by Bhanu |

పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో సోమవారం విషాద సంఘటన చోటుచేసుకుంది.

మల్లక్కపేట బాలికల హాస్టల్‌లో విషాదం.. పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, పరకాల : హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో సోమవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏకు శ్రీవాణి (15) హాస్టల్ గదిలో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

సమాచారం అందుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే శ్రీవాణిని పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను స్థానిక పోలీసులు నమోదు చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. శ్రీవాణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాద సంఘటన తో విద్యార్థినులలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story