- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధానమంత్రి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం 9:30 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం 9:30 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 25.41కోట్ల వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించారు. ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌లో కొత్త స్టేషన్ భవనం, వెయిటింగ్ హాళ్లు , రెండో ప్రవేశద్వారం, స్టేషన్ ఎదుట భారీ ఆవరణం, ప్రయాణికుల ర్యాంపులతో 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 3 లిఫ్టులు మరియు నాలుగు ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా మెరుగైన ల్యాండ్‌స్కేపింగ్ , హైమాస్ట్ లైట్లు, ప్లాట్‌ఫాం పునరుద్ధరణ, అదనపు ప్లాట్‌ఫాం షెల్టర్లతో సౌకర్యాలను మెరుగు పర్చారు. వరంగల్ అమృత్ స్టేషన్‌లో మెరుగైన ఈ సౌకర్యాలు, ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేయడంతో పాటు ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతాయని అధికారులు వెల్లడించారు.
ఎయిర్ పోర్టులా రైల్వే స్టేషన్
వరంగల్ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టును తలపించేలా వసతులు ఏర్పాట్లు చేశారు. లిఫ్టులు ఎస్కలేటర్లు, ర్యాంపులు విశాలమైన ఫోటో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిబించే విధంగా నిర్మాణ శైలి ఉండటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈనెల 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని పర్చువల్ గా ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.






