- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న ‘వరంగల్’ వార్: PCC చీఫ్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వద్దకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘వరంగల్ వార్’ కాకరేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య నడుస్తున్న వివాదం పీసీసీ చీఫ్ వరకు చేరింది. ఇవాళ ఉదయం మంత్రి సురేఖ మహేశ్ కుమార్ గౌడ్‌ను స్వయంగా కలిసి, జిల్లా రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడంపై ఆమె పీసీసీ చీఫ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రొటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయనకు వివరించారు. కడియం శ్రీహరిపై వెంటనే పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు (Disciplinary Action) తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.. పీసీసీ చీఫ్
అయితే, మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ (Warngal) జిల్లా నేతల మధ్య వివాదాలు, గ్రూప్ రాజకీయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని వివరించారు. త్వరలోనే కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరితో మాట్లాడి.. వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.






