- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పటికీ అఖిల్ కెరీర్‌లో ఆ సినిమానే బెస్ట్.. 'లెనిన్'తో అయినా ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా?
'లెనిన్'తో తొలి రోజు ఓపెనింగ్స్ రికార్డును అఖిల్ అధిగమిస్తాడా? అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నట వారసుల్లో ఒకరైన అఖిల్, దర్శకుడు వి.వి. వినాయక్ తెరకెక్కించిన 'అఖిల్' చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.60 కోట్ల ఓపెనింగ్స్‌ను సాధించింది. అయితే, మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత అఖిల్ నటించిన 'హలో' రూ.2.70 కోట్లు, 'మిస్టర్ మజ్ను' రూ.3.21 కోట్లు, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూ.5.45 కోట్లు, 'ఏజెంట్' రూ.4 కోట్ల ఓపెనింగ్స్‌ను రాబట్టాయి.
ఇలా ఇప్పటివరకు అఖిల్ పలు సినిమాల్లో నటించినప్పటికీ, తొలి చిత్రం 'అఖిల్'కే అత్యధిక ఓపెనింగ్స్ దక్కాయి. తాజాగా అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మూవీ టీమ్ కూడా ప్రతి ప్రచార కార్యక్రమంలో ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, అఖిల్ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే 'అఖిల్' సినిమా తొలి రోజు ఓపెనింగ్స్‌ను 'లెనిన్' అధిగమిస్తుందని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ తన తొలి సినిమా రికార్డును అధిగమిస్తాడా లేదా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






