- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, బీర్ బాటిళ్లతో..!
అనంతపురం జిల్లా రాప్తాడులో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే పరిటాల ఫ్యామిలీ తనను చంపేందుకు ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమన్నారు...

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాప్తాడులో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే పరిటాల ఫ్యామిలీ తనను చంపేందుకు ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తోపుదుర్తి చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరారు. దీంతో తోపుదుర్తి వర్సెస్ పరిటాలగా పరిస్థితి మారింది. మరోవైపు రెండేళ్లలో బాగా సంపాదించారంటూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై చేసిన వ్యాఖ్యలను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఎమ్మెస్ రాజు సైతం ఛాలెంజ్ చేశారు.
ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరామ్‌తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కూడా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే చెప్పుతో కొడతానని తోపుదుర్తిని ఎమ్మెస్ రాజు హెచ్చరించారు. ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే పదవితో పాటు టీటీడీ పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే తోపుదుర్తి ఇంటికి వెళ్తానని ఎమ్మెస్ రాజు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో తోపుదుర్తి కూడా తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తోపుదుర్తి ఇంటి వద్దకు వెళ్లారు. ఈ మేరకు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను తోపుదుర్తి అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే తోపుదుర్తి ఇంట్లో కంకర రాళ్లు, ఖాళీ బీర్ బాటిళ్లు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు.






