- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. హాస్టల్ గదిలో విద్యార్థినులను కాటేసిన కట్లపాము
జార్ఖండ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన హాస్టల్ గదిలో విద్యార్థినులు నిద్రిస్తుండగా.. విషసర్పం దాడిచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన హాస్టల్ గదిలో విద్యార్థినులు నిద్రిస్తుండగా.. విషసర్పం దాడిచేసింది. లోహర్దగా జిల్లాలో కురు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోచో మహువాతోలిలో ఉన్న సన్వాసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ లో మంగళవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిద్రిస్తున్న సమయంలో.. నలుగురు విద్యార్థినులను పాము కాటేయగా.. 12 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు విద్యార్థినులను లోహర్దగా సదర్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒక బాలిక పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి విద్యార్థినులంతా రాత్రి భోజనం ముగించుకుని గ్రౌండ్ ఫ్లోర్ లోని తమ హాస్టల్ గదిలోకి నిద్రించడానికి వెళ్లారు. ఆ గదిలో ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో కట్లపాము లోపలికి ప్రవేశించి ఓ బాలికను కాటు వేసిందని తెలిపారు. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో మిగతా విద్యార్థినులు కూడా నిద్రలేచి.. అప్రమత్తమయ్యేలోపే ఆ పాము మరో ముగ్గురిని కాటేసింది. ఈ ప్రమాదంలో మరణించిన బాలికను స్నేహా పీఎస్ పరిధిలోని ఆలౌది నవాతోలికి చెందిన వర్షా ఒరాన్ గా గుర్తించారు. హాస్టల్ గదిలోకి పాము ఎలా వచ్చిందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని, దానిపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






