- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టరేట్ వద్ద పురుగుల మందు డబ్బాతో మహిళ హల్చల్
బెజ్జంకి నిహారిక అనే మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగింది.

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : భూ వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ బెజ్జంకి నిహారిక అనే మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగింది. మొదట ఓ వినతి పత్రాన్ని కార్యాలయంలో అధికారులకు అందజేసి, అనంతరం పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ ప్రాంగణంలో కూర్చుంది. గమనించిన పోలీసు సిబ్బంది, వెంటనే ఆమె దగ్గరి నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. తన తండ్రి ద్వారా పసుపు కుంకుమ కింద వెల్దుర్తి గ్రామంలో 30 గుంటల భూమి తనకు సంక్రమించిందని తెలిపారు. ఆ భూమిని చదును చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామ సర్పంచ్ భర్త అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారుల పేరు చెప్పి పని చేయకుండా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు. ఇక వేరే గత్యంతరం లేక న్యాయం కోసం పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు నిహారిక తెలిపారు. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు, మహిళను సముదాయించి సంబంధిత అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు.






