Warangal: వరంగల్ ఎంపీ సీటు ఆ పార్టీదే.. అనూహ్యంగా ఊహించని షాక్ ఇవ్వబోతున్న జనం?

by Kema Shiva Kumar |   (  Updated:2024-06-02 17:17:48  IST  )

తెలంగాణలో ఎంపీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. మెజారిటీ సీట్లలో గెలుపు మాదంటే మాదని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు.

Warangal: వరంగల్ ఎంపీ సీటు ఆ పార్టీదే.. అనూహ్యంగా ఊహించని షాక్ ఇవ్వబోతున్న జనం?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎంపీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. మెజారిటీ సీట్లలో గెలుపు మాదంటే మాదని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రెండో రాజధానిగా భావించే వరంగల్‌లో ఎన్నికల ప్రచారం రసవత్తంరంగా మారింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిక, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన కూతురు అభ్యర్ధి కడియం కావ్య ప్రకటించినప్పుడు నిజానికి గెలుపు అవకాశాలు హస్తం పార్టీకే ఉన్నాయి. అయితే, ప్రచారం దగ్గరపడుతున్నా కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అదే విధంగా మరోవైపు ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌ ఆర్ధికంగా బలంగా ఉండటంతో పాటు భారీగా కేడర్ అయనకు పూర్తిగా కలిసొచ్చింది.

అదేవిధంగా పోలింగ్ మరో రెండు రోజులు ఉందనగా జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ సానుభూతిపరులు, సంఘ్ నేతలు, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ నేతలు వరంగల్ సెగ్మెంట్‌లోని అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు తిరుగుతూ.. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. వరంగల్‌కు స్మార్ట్ సిటీ గుర్తింపు, ఎయిర్‌పోర్ట్ హామీ, కాజీపేట్ రైల్వే డివిజన్ లాంటి అన్ని అంశాలను కమలనాథులు జోరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మరో‌వైపు మందకృష్ణ మాదిగ ప్రచారం కమలం పార్టీకి పెద్ద ఎత్తున కలిసొచ్చింది. మాదిగ ఉప కులాల వర్గీకరణకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించడంతో ప్రతి మాదిగ బిడ్డ బీజేపీకే ఓటు వేయాలంటూ మంద కృష్ణ మాదిగ అభ్యర్థి ఆరూరి వెన్నంటే ఉండి ప్రచారం చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికల ముందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఇంతకు ముందే అ పార్టీలో ఉన్న నాయకుల మధ్య కో-ఆర్డీనేషన్ పూర్తిగా కట్ అయింది. ముఖ్యంగా మోడీ చరిష్మా ఆరూరి గెలుపునకు బాటలు వేశాయని జనం చర్చించుకుంటున్నారు.

Next Story