- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి వద్దకు వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ..
వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్చెంతకు చేరింది. ఇటీవల కొండా మురళీ

* మీనాక్షి నటరాజన్‌తో వరంగల్ఎమ్మెల్యేల భేటీ
* కొండా దంపతులపై.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
* కొండా మురళీ, మంత్రి సురేఖపై ఫిర్యాదు
* విచారణ కమిటీ వేసేందుకు నిర్ణయం
* పారదర్శికంగా విచారణ జరిపిస్తామని నేతలకు హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్చెంతకు చేరింది. ఇటీవల కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు రోజుల క్రితం వరంగల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ లో భేటీ అయిన నేతలంతా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యానారయణ, రేవూరి ప్రకాశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతోపాటు ముఖ్య నేతలు దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు. ఈసందర్భంగా గడిచిన ఏడాదిగా వరంగల్లో జరుగుతున్నటువంటి పరిణమాలు, కొండా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
కొండా దంపతులపై.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు వెనుక ఉన్నటువంటి కారణాలు అన్నింటికీ మీడియా ప్రకటనలకు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, డాక్యూమెంట్స్‌తో ఉమ్మడిగా నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కొండా మురిళీపై వెంటనే పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఒకదశలో పార్టీకి మేం కావాలో.. కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలని కూడా ఎమ్మెల్యేలు మీనాక్షితో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో మీనాక్షి నటరాజన్కొండా మురళీ వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని వారికి తెలిపారు.
కమిటీ వేసేందుకు నిర్ణయం..
వరంగల్ కాంగ్రెస్‌పార్టీలో జరుగుతన్న అధిపత్య పోరు ముదిరి పాకన పడుతున్నట్లు క్రమంలో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా విచారణ కమిటీ వేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో జిల్లాలకు సంబంధం లేనటువంటి నేతలతో పారదర్శికంగా విచారణ జరిపిస్తామి నేతలకు మీనాక్షి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ముగ్గురి సభ్యులతో కమిటీ వేయనున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇబ్బంది పడుతున్నామని మీనాక్షి నటరాజన్‌కు ముందు చెప్పిన నేపథ్యంలో కమిటీ వేయనున్నారు. అయితే, కొండా మురళీ కామెంట్స్నేపథ్యంలో స్పందించిన టీపీసీసీ ఛీప్పరిశీలకులన్నీ నియమించామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పరిశీలకుల పని మొదలు పెట్టినట్లు పరిస్థితి కనిపించలేదు. మీనాక్షి నటరాజన్కమిటీ వేసి ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని ఆలోచనతో ఉన్నట్టు ఆమె నేతలకు చెప్పారు. ఈ ముగ్గురు కమిటీ నివేదిక కీలకం కానుండగా నివేదిక అనుగుణంగా అధిష్టానం ఏమేరకు చర్యలు ఉంటాయోనని కాంగ్రెస్వర్గీయుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి వరంగల్కాంగ్రెస్నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీ ఇంచార్జి మీనాక్షి దాకా చెంతకు చేరడం.. ఈ వ్యవహారానికి పుల్ స్టాఫ్ఎప్పుడు పడుతుందో? అన్నది వేచిచూడాలి.






