మాజీ ఉపముఖ్యమంత్రుల మధ్య మాటల వార్.. రాజయ్యకు కడియం కౌంటర్

by Ramesh Goud |

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రుల (Telangana Former Deputy CMs) మధ్య మాటల యుద్దం (War) నడుస్తోంది.

మాజీ ఉపముఖ్యమంత్రుల మధ్య మాటల వార్.. రాజయ్యకు కడియం కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రుల (Telangana Former Deputy CMs) మధ్య మాటల యుద్దం (War) నడుస్తోంది. నువ్వెంత అంటే నేనెంత అనేలా.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) నియోజకవర్గంలో రాజకీయాలు (Politics) హాట్ టాపిక్ (Hot Topic) గా మారాయి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Former MLA Thatikonda Rajayya) వ్యాఖ్యలకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) కౌంటర్ (Counter) ఇచ్చారు. రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కక్ష్య సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఆరు నెలల్లోనే దాదాపు ఏడుగురు వ్యక్తులపై అక్రమ కేసులు (False Cases) బనాయించాడని అన్నారు.

అంతేగాక నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంగా కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్నాడని దుయ్యబట్టారు. నైతిక విలువలు లేకుండా.. గెలిచిన పార్టీకి, పదవికి రాజీనామా (Resign) చేయకుండా పార్టీ మారాడని, ఈ 13 నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్ కు ఏం చేశాడో శ్రీహరి చెప్పాలని రాజయ్య సవాల్ (Challenge) విసిరాడు. దీనిపై కడియం శ్రీహరి స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Government) ఓర్వలేక అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నాడని, స్టేషన్ ఘన్‌పూర్ ను మున్సిపాలిటీ (Municipolity) చేసుకోవడమే కాక, వెయ్యి కోట్ల నిధులు తెచ్చానని స్పష్టం చేశారు.

15 ఏళ్లు ఎమ్మెల్యేగా.. పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్న పని కూడా చేయలేకపోయాడని దుయ్యబట్టారు. చేతగానివారు, చేవలేని వారు, అవినీతి పరులు ఈ రోజు నాపై చవకబారు మాటలు మాట్లాడుతున్నారని కడియం మండిపడ్డారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారం కోసం పార్టీ మారానని తెలిపారు. అంతేగాక అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు (Supreme Court)లో ఉన్నదని, ఈ నెల 10న తీర్పు రాబోతున్నదని, ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని కడియం తేల్చి చెప్పారు.

Next Story