- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్‌లో కాంగ్రెస్‌కు ధీటుగా బీఆర్ఎస్‌కు ఓట్లు : మాజీమంత్రి తలసాని
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ కు ఓట్లు వచ్చాయని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

- మా నాయకుల పోరాట పటిమ చిన్న విషయం కాదు
- 17న రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
- మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్
దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీకి ధీటుగా తమ పార్టీకి ఓట్లు వచ్చాయని.. తమ నాయకుల పోరాట పటిమ చిన్న విషయం కాదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరెంట్, నీళ్లు గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అని.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇచ్చారని పేర్కొన్నారు. తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే.. అదే రోజు తెలంగాణ భవన్‌లోనూ వేడుకలు ఉంటాయని.. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను భవన్ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, కిశోర్‌గౌడ్, ముఠా జయసింహతో కలిసి పరిశీలించారు.






