- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
viziendira : గురుకులాల సొసైటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విజయేందిర బోయి
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమితులైన విజయేందిర బోయి శనివారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమితులైన విజయేందిర బోయి శనివారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సొసైటీ కార్యదర్శిగా ఉన్నఎస్. కృష్ణ ఆదిత్య నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. విజయేందిర బోయి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌గా కూడా సేవలందించనున్నారు. ఆమె అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా, రవాణా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా, రోడ్లు, భవనాల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా కీలక పదవులను నిర్వహించారు.
విస్తృత పరిపాలనా అనుభవం కలిగిన విజయేందిర బోయి నాయకత్వంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సంస్థ విద్యా నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర వికాసంలో మరింత పురోగతి సాధిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది విజయేందిర బోయికి స్వాగతం పలికి, ఆమె నాయకత్వంలో సంస్థ మరిన్ని విజయాలను సాధిస్తుందని ఆకాంక్షించారు.






