- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు తెలంగాణ నిరుద్యోగులు కనిపించలేదా..? విఠల్
by Satheesh |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్‌ను ఆమోదించలేదని, అలాంటప్పుడు బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాల్లో ఆయన ఎలా

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్‌ను ఆమోదించలేదని, అలాంటప్పుడు బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాల్లో ఆయన ఎలా పాల్గొంటారని టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారని, వారిని కాదని మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లోకి చేరిన వ్యక్తికి రూ.1.8 లక్షల జీతం ఇచ్చి ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇది అధికారిక దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన ఘాటుగా స్పందించారు. మహారాష్ట్ర వ్యక్తికి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. సీఎస్ శాంతి కుమారి గుట్టు చప్పుడు కాకుండా జీవోలు జారీ చేశారని, తన అధికారాన్ని దుర్వనియోగం చేశారని ఆయన విమర్శలు చేశారు.
Next Story






