- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ.. 10 కీలక వ్యూహాలతో రూపకల్పన
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ.. 10 కీలక వ్యూహాలతో రూపకల్పన

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్(Telangana Rising Vision Document)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. మొత్తం 83 పేజీలతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపకల్పన చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్‌ను రూపొందించారు. యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణను విభజించడంతో పాటు తాత్కాలిక విధానం నుంచి స్థిరమైన విధానం వైపు తెలంగాణ ప్రయాణం మొదలైందని డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.






