ముదురుతున్న వివాదం.. రాజమౌళి సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ వార్నింగ్

by Ramesh Naini |

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.

ముదురుతున్న వివాదం.. రాజమౌళి సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ సీరియస్ అయింది. రాజమౌళి సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ వార్నింగ్ ఇచ్చింది. హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో రాజమౌళి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తింది. ఈ మేరకు రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తాం అని తాజాగా విశ్వహిందూ పరిషత్ నేత తనికెళ్ల సత్య కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, ఎస్ ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘నాకు దేవుడి నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన (హనుమంతుడు) ఉంటే ఇదేనా నడిపించేది?’ అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతిన్నాయి. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు. హిందూ బంధువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతిస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలని తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యల వివాదం ఇంకా ముదురుతోంది.

Next Story