- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Koya Language Wedding : వైరల్ వెడ్డింగ్ కార్డు..కోయ భాషలో పెళ్లి శుభలేఖ
ఏ జాతి మనుగడకైనా..మాతృభాష(Mother Tongue) జీవనాడి వంటింది. అందుకే కవి..రచయితలు అమ్మభాష తల్లి పాల వంటిది..పరాయి భాష పోత పాల వంటిందంటారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏ జాతి మనుగడకైనా..మాతృభాష(Mother Tongue) జీవనాడి వంటింది. అందుకే కవి..రచయితలు అమ్మభాష తల్లి పాల వంటిది..పరాయి భాష పోత పాల వంటిందంటారు. ఆధునిక విద్య..ఉపాధి వేటల ఒరవడిలో భారతదేశంలోని అనేక మాతృభాషలు క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో ఓ కోయ యువకుడు మాత్రం మాతృభాషపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా భావించే పెళ్లి వేడుకను మాతృభాష చాటింపు వేదికగా చేసుకుని తన భాషాభిమానాన్ని చాటుకున్నాడు.
తన మాతృభాషపై ఉన్న మమకారంతో పెళ్లి శుభలేఖ(Wedding Card)ను తన కోయ భాష(Koya Language)లోనే ముద్రించగా...ఇప్పుడీ వివాహా ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్‌నగర్‌కు చెందిన ఉండం శ్రీనివాస్(Srinivas) అనే కోయ యువకుడికి అదే జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన చింత వినిత(Vinita)తో పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెల 2వ తేదీ పెళ్లి ముహూర్తం ఖరారైంది. తన పెళ్లి శుభలేఖను
వరుడు ఉండం శ్రీనివాస్ తన మాతృభాషయైన కోయ భాషలో ముద్రించి బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాడు. పెళ్లి శుభలేఖలో వధువు, వరుడు పదాలతో సహా, ముహుర్తం, ఆతిథులకు ఆహ్వానం, విందు తదితర వివరాన్నింటికి కూడా కోయ భాషలోనే ముద్రింపచేసి అందరికి పెళ్లి పిలుపు శుఖలేఖలను పంపించాడు.
కోయ భాషలో ఆ యువకుడు రూపొందించుకున్న ఈ పెళ్లి శుభలేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కోయ భాషలో పెళ్లి శుభలేఖను చూసిన నెటిజన్లు యువకుడి మాతృభాషాభిమానాన్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంతరించిపోయే జాబితాలో ఉన్న ఆదివాసీ, గిరిజనుల మాతృభాషాల పరిరక్షణ కోణంలో వినూత్నంగా వరుడు శ్రీనివాస్ కోయభాష పెళ్లి శుభలేఖ మంచి ప్రయత్నమని ప్రశంసిస్తున్నారు.






