- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: బుల్లెట్ దిగిందా లేదా..! ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్‌కు ఎంపీ రఘునందన్ రావు షాకిచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) యూ టర్న్‌తో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకుంది. తాజాగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని సైతం చేజిక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా మోటే సుమలత, వైస్ చైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో ఓటు వేసి తిరిగి వెళ్తున్న గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటింగ్ ఎలా జరగిందని ప్రశ్నించగా.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతను ఉద్దేశంచి ఆయన ‘బుల్లెట్ దిగిందా లేదా’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
కాగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 వార్డుల్లో విజయం సాధించారు. అందులో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌లోకి వెళ్లగా ఒకరు బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో రెండు పార్టీల సంఖ్య 13కు చేరింది. దీంతో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఎంపీ రఘునందన్ రావు షాకిచ్చారు. ఆయన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో ఒకే వాహనంలో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ గులాబీ వశమైంది.






