- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
తెలంగాణలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు (Vinayaka immersions) ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో "తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని, వినాయక నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు (Congratulations) తెలుపుతున్నట్లు రాసుకొచ్చారు.
అలాగే హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం 4 గంటల తర్వాత ఊహించని రీతిలో భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు పోటెత్తాయి. దీంతో ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రధాన మార్గంలో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనాల కోసం క్యూలో వేచి ఉన్నాయి.






