Vinayaka Chavithi: పోలీస్ అధికారులను CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వినాయక చవితి(Vinayaka Chavithi) శుభాకాంక్షలు తెలిపారు.

Vinayaka Chavithi: పోలీస్ అధికారులను CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వినాయక చవితి(Vinayaka Chavithi) శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ విఘ్నేశ్వరుడుని ప్రార్థించారు. వాడ వాడలా వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్(Telangana Police) ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నదని శుభవార్త చెప్పారు.

Next Story