- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులు చేసేది హింస అయితే.. మరి మీరు చేసేదేంటి?: విమలక్క ఫైర్
మావోయిస్టులు చేసేది హింస అయితే.. మరి మీరు చేసేదేంటి?: విమలక్క ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్(Operation Kagar), వరుస ఎన్‌కౌంటర్లపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క(Vimalakka) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మానవ హననం చేస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు చేసేది హింస అయితే.. మరి మీరు చేసేది ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి హింస చేస్తోందని కదా అని అడిగారు. తుపాకీకి తుపాకీ పరిష్కారం కాదని హితవు పలికారు. సమస్యలు ఎక్కడివక్కడే వదిలేసి చంపుకుంటూ వెళ్తాం.. ఎవరూ ప్రశ్నించొద్దు అనే వైఖరి సరికాదని అన్నారు. ప్రభుత్వమే తప్పు చేస్తూ.. మావోయిస్టులను చంపడం ఏం సంస్కారం అని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి.. చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.






