Palm wine: కల్లు ధరలు తగ్గించాలని ధర్నాకు దిగిన గ్రామస్తులు.. ఎక్కడంటే..?

by Ramesh Naini |

కల్లు ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Palm wine: కల్లు ధరలు తగ్గించాలని ధర్నాకు దిగిన గ్రామస్తులు.. ఎక్కడంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (kallu) కల్లు ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం పెద్దేముల్ గ్రామంలో అధిక ధరకు కల్లు అమ్ముతున్నారని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మాకు కల్లు అందుబాటు ధరలో ఉండాలి.. ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే మేము ఎలా తాగాలని నిరసన కారులు వారి కష్టాలు తెలియజేశారు. ఈ సమాచారం స్థానిక పోలీసులకు తెలియడంతో నిరసనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.

Next Story