- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్‌కుమార్ ఆత్మహత్యతో ఈ కేసు ముగియలేదు - విజయశాంతి
by velandi.Saikiran |
రాజ్‌కుమార్ ఆత్మహత్యతో ఈ కేసు ముగియలేదని తెలిపారు విజయశాంతి.

X
Vijayashanthi
దిశ, వెబ్ డెస్క్: రాజ్‌కుమార్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆరుగురిని చంపిన రాజ్ కుమార్, తాజాగా సుసైడ్ చేసుకున్నాడు. అయితే, ఈ సంఘటనపై రాములమ్మ రియాక్ట్ అయ్యారు. రాజ్‌కుమార్ ఆత్మహత్యతో ఈ కేసు ముగియలేదని తెలిపారు విజయశాంతి. పోక్సో కేసులో అరెస్ట్ చేయకుండా పోలీసులు లంచం తీసుకున్నారని తెలిసి మహిళా లోకం షాక్‌కి గురైందని పేర్కొన్నారు.
పోలీసులు చేసిన ఈ తప్పు వల్లే.. ఆరుగురి ప్రాణాలను కడతేర్చడానికి ఆస్కారం ఏర్పడిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలోని ఇలాంటి లోపాల వల్లే రాష్ట్రంలో మహిళా భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహారించాలని కోరుతున్నా అంటూ విజయశాంతి పోస్ట్ పెట్టారు.
Next Story






